![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -286 లో..... దీపని కార్తీక్ తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తాడు. మొన్న బర్త్ డే పార్టీకి వచ్చినప్పుడు పారిజాతం గారు ఏదో అన్నారు కదా.. దీపది ఇడ్లీ బండి రేంజ్ అన్నావ్ కదా.. ఆ రేంజ్ కాదని చెప్పడానికి వచ్చాను.. సత్యరాజ్ రెస్టారెంట్ ని మేం తీసుకుంటున్నాం ట్వంటీ ఫైవ్ పెర్సెంట్ షేర్.. ఇప్పుడు ఒప్పుకుంటారు దీపది రెస్టారెంట్ రేంజ్ అని కార్తీక్ గర్వంగా కార్తీక్ చెప్తుంటాడు. అది ఆల్రెడీ దోమలు, ఈగలు కొట్టుకుంటున్న రెస్టారెంట్.. ఇప్పుడు మీరు దాన్ని తీసుకొని ఏం చేస్తారని శివన్నారాయణ అంటాడు.
కాసేపటికి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అని కార్తీక్, దీప లు సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి మరి అవమానిస్తారా మీ సంగతి చెప్తానంటూ జ్యోత్స్న అనుకుంటుంది.. ఆ తర్వాత కార్తీక్, దీపలు ఇంటికి వెళ్లి గుడ్ న్యూస్ చెప్పగానే.. వాళ్ళు సంతోషపడతారు. ఇక కార్తీక్ జ్యోత్స్న వచ్చిన విషయం.. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లిన విషయం కాంచనకి చెప్తాడు. ఇప్పుడు అదంతా ఎందుకు కానీ నోరు తీపి చెయ్ అని దీప తో కార్తీక్ అంటాడు. దీప కిచెన్ లోకి వెళ్లి స్వీట్ చేస్తుంది. అప్పుడే షుగర్ డబ్బా మూత రావడం లేదని కార్తీక్ ని పిలుస్తూ తనకు ఎదరుపడి డాష్ ఇస్తుంది. దాంతో ఇద్దరు కిందపడిపోతారు. కార్తీక్ షుగర్ డబ్బా మూత తీసి ఇస్తాడు. చాలా థాంక్స్ దీప.. నీ వల్లే ఇదంతా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ తన ప్రాణధాత గురించి మాట్లాడతాడు. ఒకవేళ నీ ప్రాణధాత బ్రతికి లేకుంటే అని దీప అనగానే.. ఇంకెప్పుడు అలా అనకు దీప.. తను ఎదరు పడాలి.. నీ నోటితో నా ప్రాణధాత ఎదురుపడుతుందని అనవా.. నువ్వు ఏది అంటే అది జరుగుతుందని ఒక నమ్మకం అని కార్తీక్ అంటాడు.
మీ ప్రాణధాత నా లాగే మీ ముందు నిలబడుతుందని దీప అనగానే.. కార్తీక్ హ్యాపీగా వెళ్ళిపోతాడు. నేనే మీ ప్రాణధాతని కార్తీక్ బాబు. అది మీరు గెలిచిన రోజు మీ ముందుకి వచ్చి.. నేనే మీ ప్రాణధాతని అని చెప్తానని దీప అనుకుటుంది. మరొకవైపు దాస్ స్పృహ లోకి వచ్చి దీప అసలైన వారసురాలని అన్నయ్యకి చెప్పాలని దశరథ్ కి ఫోన్ చేస్తాడు. ఏంటి దాస్ ఫోన్ చేస్తున్నాడు.. స్పృహలోకి వచ్చాడా గతం గుర్తుకి వచ్చిందా అని దశరథ్ అనుకుంటాడు. అదంతా జ్యోత్స్న విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |